AP High Court: సిఫారసులతోనే రెండు జిల్లాల్లో ఎక్కువ బదిలీలు
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:20 AM
ఉమ్మడి కృష్ణా, కర్నూలు జిల్లాల్లోని గ్రామ సచివాలయాల్లో పని చేసే విలేజ్ అగ్రికల్చల్ అసిస్టెంట్స్‌ను బదిలీ చేసిన విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
ఉమ్మడి కృష్ణా, కర్నూలులో మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహించండి
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ బదిలీలపై కలెక్టర్లకు హైకోర్టు ఆదేశం
ఇతర జిల్లాల విషయంలో జోక్యానికి నిరాకరణ
ఇంటర్నెట్ డెస్క్: ఉమ్మడి కృష్ణా, కర్నూలు జిల్లాల్లోని గ్రామ సచివాలయాల్లో పని చేసే విలేజ్ అగ్రికల్చల్ అసిస్టెంట్స్‌ను బదిలీ చేసిన విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ రెండు జిల్లాల్లో ప్రజాప్రతినిధుల సిఫారసు ఆధారంగా ఎక్కువ బదిలీలు జరిగాయని చెప్పింది. కార్యనిర్వాహక ఆదేశాలు పక్కనపెట్టి సిఫారసుల ఆధారంగా బదిలీ చేయడమంటే సమాంతరపాలన భావన కలిగిస్తోందని తెలిపింది. నిబంధనల అమలులో అఽధికారులు విఫలమయ్యారని పేర్కొంది. ఆ రెండు జిల్లాల్లో మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ ప్రక్రియను అమలు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఇతర జిల్లాల్లో సిఫారసులు పెద్దగా లేనందున జోక్యం చేసుకోబోమంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.విజయ్ ఇటీవల కీలక తీర్పు ఇచ్చారు.