Share News

AP High Court: సవివరంగా కౌంటర్‌ దాఖలు చేయండి

ABN , Publish Date - Nov 06 , 2025 | 05:42 AM

టీసీఎస్‌ సంస్థకు విశాఖలో భూకేటాయింపులను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.

AP High Court: సవివరంగా కౌంటర్‌ దాఖలు చేయండి

  • టీసీఎస్‌కు భూ కేటాయింపులపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): టీసీఎస్‌ సంస్థకు విశాఖలో భూకేటాయింపులను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలతో ప్రస్తుత పిల్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖలో టీసీఎ్‌సకు 21.16 ఎకరాలను 99పైసలకే కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు ఈ పిల్‌పై పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సత్యప్రసాద్‌, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్‌జీపీ ఎస్‌.ప్రణతి వాదనలు వినిపించారు.

Updated Date - Nov 06 , 2025 | 05:42 AM