Share News

AP Health Secretary: ఆరోగ్య రంగంలో ‘ఏఐ’ వినియోగం

ABN , Publish Date - Dec 13 , 2025 | 05:49 AM

ఆరోగ్య రంగంలో ఐటీని అనుసంధానం చేసి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) వినియోగం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు...

AP Health Secretary: ఆరోగ్య రంగంలో ‘ఏఐ’ వినియోగం

  • 15న విజయవాడలో జాతీయస్థాయి సదస్సు

అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆరోగ్య రంగంలో ఐటీని అనుసంధానం చేసి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) వినియోగం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నా యి. దీనిలో భాగంగా ‘ఆరోగ్య రంగం-కృత్రిమ మేధ వినియోగ విధానం రూపకల్పన-సంబంధిత విభాగాల భాగస్వామ్యం’ పేరిట కేంద్రం జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోందని రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ తెలిపారు. ఈ నెల 15న విజయవాడలో ఈ సదస్సు నిర్వహిస్తామన్నారు. ఈ సదస్సులో ఏపీతోపాటు తెలంగాణ, ఒడి సా, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరి పాల్గొంటాయని చెప్పారు. ఆరోగ్యశాఖ పది ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసిందన్నా రు. ఈ సందర్భంగా ఆరోగ్యరంగంలో ఐటీ అనుసంధానం, ఏఐ వినియోగంపై చర్చించనున్నారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధను వినియోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కేంద్రం భావిస్తోంది. తదనుగుణం గా జాతీయస్థాయిలో ముసాయిదా రూపకల్పనకు కేంద్ర ఐటీ శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలో ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహించి అధికారులు, నిపుణుల అభిప్రాయాలు సేకరించనుంది. ఢిల్లీ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నిర్వహించే ‘ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ ఫర్‌ హెల్త్‌’ సదస్సులో ముసాయిదా రూపొందిస్తారు.

Updated Date - Dec 13 , 2025 | 05:49 AM