AI Technology: ఆరోగ్యశాఖలో ఏఐ టెక్నాలజీ
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:06 AM
ఆరోగ్య శాఖలోని హెల్త్ డేటా ఆధారంగా ఏఐను అనుసంధానం చేయనున్నట్టు ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. సోమవారం విజయవాడలో....
అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య శాఖలోని హెల్త్ డేటా ఆధారంగా ఏఐను అనుసంధానం చేయనున్నట్టు ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. సోమవారం విజయవాడలో ‘రీజినల్ మల్టీ స్టేక్ హోల్డర్స్ కన్వర్షన్ వర్క్‌షాప్ ఆన్ నేషనల్ ఏఐ స్ట్రాటజీ ఫర్ హెల్త్’ అంశంపై ఒకరోజు వర్క్‌షాప్ జరిగింది. డబ్ల్యూహెచ్‌వో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్, కేంద్ర ప్రభుత్వం సయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ నుంచి ఆరోగ్యశాఖ, ఐటీ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశాఖలో ఏఐ వినియోగం ద్వారా అత్యుత్తమ ఫలితాలు వస్తాయని సౌరబ్ గౌర్ అన్నారు. ఏఐ వినియోగంపై ఫిబ్రవరిలో ముసాయిదా పాలసీని తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జోనల్ స్థాయి వర్క్‌షా్‌పలు నిర్వహిస్తుందని తెలిపారు.