Andhra Pradesh Government: 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:21 AM
రాయలసీమలో కీలకమైన కడప జిల్లాకు ప్రభుత్వం కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీ్‌స(ఎస్పీ)ని నియమించింది....
కడప ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్
ఇంటెలిజెన్స్ నుంచి జిల్లా బాధ్యతలు
తిరుపతి ఎస్పీ ప్రకాశం జిల్లాకు బదిలీ
చివరిక్షణంలో ఆగిన విశాఖ సీపీ, ఐజీల బదిలీ
వీరిలో ఏడుగురు కొత్తవారికి అవకాశం
మరో ఏడుగురు అధికారులకు స్థానచలనం
అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): రాయలసీమలో కీలకమైన కడప జిల్లాకు ప్రభుత్వం కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీ్‌స(ఎస్పీ)ని నియమించింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న నచికేత్ విశ్వనాథ్‌ను కడపకు పంపింది. అదేవిధంగా తిరుపతి ఎస్పీగా ఉన్న హర్షవర్థన్‌రాజును ప్రకాశం జిల్లాకు బదిలీ చేసింది. ఇలా.. మొత్తం 14 జిల్లాలకు ఎస్పీలను నియమించింది. వీరిలో ఏడుగురు కొత్తవారు కాగా, మరో ఏడుగురిని ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల నుంచి మరో జిల్లాకు పంపించింది. దీంతో కొన్ని నెలలుగా జరుగుతున్న జిల్లా ఎస్పీల బదిలీ ప్రక్రియపై చర్చకు ప్రభుత్వం ముగింపు పలికింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌తో పాటు పలు జిల్లాల ఎస్పీలు, డీఐజీలు, ఐజీలు, హెచ్‌వోడీల బదిలీ ఉంటుందని ప్రచారం జరిగినా 14 జిల్లాల్లో మాత్రమే ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేసింది. 7 జిల్లాలకు కొత్త వారిని నియమించగా, ఇప్పటికే జిల్లాల్లో పనిచేస్తున్న మరో ఏడుగురు ఎస్పీలను ఇతర జిల్లాలకు పంపింది. విజయవాడ, విశాఖపట్నం పోలీసు కమిషనర్ల్లతో పాటు మిగతా 12 జిల్లాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. కడప, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, బాపట్ల, కోనసీమ జిల్లాలకు కొత్త వారిని నియమించింది. విజయనగరం, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాలకు ఇతర జిల్లాల ఎస్పీలను ప్రభుత్వం నియమించింది. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నేతృత్వంలో ఉన్నతాధికారులు రూపొందించిన బదిలీల జాబితాపై సమీక్షించిన సీఎం చంద్రబాబు శనివారం స్వయంగా ఎస్సీలతో మాట్లాడారు. అనంతరం.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న, నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, కడప ఎస్పీ అశోక్ కుమార్, నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు, కృష్ణా ఎస్పీ ఆర్. గంగాధర్‌రావుకు ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఎస్పీల బదిలీలకు సంబంధించిన వివరాలు ఇవీ..