AP Govt: రైడెన్‌కు భారీగా రాయితీలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 06:48 AM
విశాఖలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్న గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది.
రూ.22,002 కోట్ల ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వం
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): విశాఖలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్న గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ సంస్థకు మొత్తం రూ.22,002 కోట్ల మేర రాయితీలు లభిం చనున్నాయి. రూ.87,520 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో, వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఈ డేటా సెంటర్‌కు ప్రభుత్వం 480 ఎకరాలను కేటాయించింది.
1.కేటాయించిన భూముల విలువలో 25 శాతం రాయితీ ఇస్తారు. మరో 15 ఎకరాలు ల్యాండింగ్ కేబుల్ స్టేషన్‌కు కేటాయించింది. ఈ భూములకు స్టాంపు డ్యూటీ 100 శాతం మినహాయింపు ఇచ్చారు.
2.ప్లాంటు మినషనరీ ఖర్చులో 10 శాతం మూలధన రాయతీ కింద పదేళ్లలో గరిష్ఠంగా రూ.2,129 కోట్లు చెల్లించా లని నిర్ణయించించారు.
3.జీపీజీడబ్ల్యూ ఫైబర్ యాక్సెస్ కోసం చేసే వ్యయంలో 30శాతం మొత్తాన్ని 20ఏళ్లలో ప్రభుత్వ ం చెల్లిస్తుంది. ఆపరేషన్ యాజమాన్య నిర్వహణ చార్జీలు ప్రతి మూడేళ్లకు 5శాతం చొప్పున పెంచుతూ రూ.282 కోట్లు చెల్లించనుంది.
4.డేటా సెంటర్ నిర్మాణం కోసం రూ.2,245 కోట్ల జీఎస్టీకి మినహాయింపు ఇచ్చింది.
5.ఐదేళ్ల పాటు లీజులపై చెల్లించే జీఎస్టీని పూర్తిగా మినహాయిస్తారు. దీని విలువ రూ.1745 కోట్లు. నీటి చార్జీపై పదేళ్లపాటు 25శాతం రాయితీ ఇస్తారు.