Chief Secretary Vijay Anand: ఈహెచ్‌ఎస్, డబ్యూజేహెచ్‌ఎస్‌పై కమిటీ
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:03 AM
ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం, వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య పథకంలో తలెత్తుతున్న సమస్యలపై సీఎం చంద్రబాబు...
అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం, వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య పథకంలో తలెత్తుతున్న సమస్యలపై సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అధికారుల కమిటీని నియమించింది. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు సీఎస్ కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీ 8వారాల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. కాగా, ఈ కమిటీలో నెట్‌వర్క్ ఆస్పత్రులు, జర్నలిస్టుల అసోసియేషన్ నుంచి సభ్యులను నియమిస్తే మరింత లోతుగా సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.