AP Govt: అర్బన్ అథారిటీల చైర్మన్ల పదవీ కాలం పొడిగింపు
ABN , Publish Date - Sep 30 , 2025 | 06:10 AM
రాష్ట్రంలోని అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీల చైర్మన్ల పదవీ కాలాన్ని ఏడాది నుంచి ప్రభుత్వం రెండేళ్లకు పొడిగించింది.
అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీల చైర్మన్ల పదవీ కాలాన్ని ఏడాది నుంచి ప్రభుత్వం రెండేళ్లకు పొడిగించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మెట్రో పాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీస్ చట్టంలో సవరణ చేస్తూ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆయా అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీలకు 2024 నవంబరులో, ఈ ఏడాది మే, ఆగస్టు నెలల్లో నియమితులైన చైర్మన్ల పదవీ కాలాన్ని వారి నియామక తేదీ నుంచి రెండేళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.