AP Govt: డేటా సెంటర్‌కు 480 ఎకరాలు
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:29 AM
విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న వేయి మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌కు 480 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
విశాఖ జిల్లా తర్లువాడ, అడవివరం, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో కేటాయింపు
విశాఖపట్నం, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న వేయి మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌కు 480 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న అదానీ ఇన్‌ఫ్రా పేరున భూములు ఇవ్వాలని గూగుల్ విజ్ఞప్తి చేయడంతో ఆ మేరకు కేటాయింపులు చేసింది. గూగుల్‌కు విశాఖపట్నం జిల్లా తర్లువాడ, అడవివరం, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో మొత్తం 480 ఎకరాలు ఇవ్వడానికి అంగీకరించింది. వీటిని సర్వే చేసి, బదలాయించాలని ఏపీఐఐసీని రైడెన్ ఇన్ఫోటెక్ కోరగా నవంబరు 28న మంత్రివర్గం సమావేశం ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిసెంబరు 2న ప్రభుత్వం భూములను అదానీ ఇన్‌ఫ్రా పేరిట బదలాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖలో గూగుల్ దశల వారీగా వేయి మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటుచేస్తుంది. పెట్టుబడిని రూ. 1.35 లక్షల కోట్లకు పెంచడానికి అంగీకరించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.