Governor Nazir: మదీనాకు గవర్నర్ నజీర్ బృందం
ABN , Publish Date - Nov 20 , 2025 | 04:35 AM
సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగినరోడ్డు ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయ కుటుంబాలకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించడానికి....
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగినరోడ్డు ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయ కుటుంబాలకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పంపిన అత్యున్నత స్థాయి బృందం బుధవారం సౌదీకి చేరుకుంది. మదీనాలోని ప్రిన్స్ మహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజీ విమానాశ్రయంలో ఈ బృందానికి సౌదీలో భారత రాయబారి సొహైల్ అహ్మద్ ఖాన్, కాన్సుల్ జనరల్ ఫహాద్ ఖాన్ స్వాగతం పలికారు. ఇదే విమానంలో హైదరాబాద్ నుంచి మృతుల కుటుంబాలకు చెందిన 39 మంది బంధువులు కూడా మదీనాకు చేరుకున్నారు. వారి నుంచి డీఎన్‌ఏ శాంపిల్స్ సేకరించారు. కాగా, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్‌తో పాటు సౌదీలోని టీడీపీ నాయకులు జానీ బాషా, ఖలీద్ సైఫుల్లా కూడా పార్టీ తరఫున అంత్యక్రియల్లో పాల్గొంటారని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి.