Share News

Private Bus Road Accident: ప్రమాదంపై గవర్నర్‌, సీఎం, డిప్యూటీ సీఎం దిగ్ర్భాంతి

ABN , Publish Date - Oct 25 , 2025 | 05:46 AM

రోడ్డు ప్రమాదంపై గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన ప్రయాణికులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని గవర్నర్‌ జిల్లా అధికారులను ఆదేశించారు.

Private Bus Road Accident: ప్రమాదంపై గవర్నర్‌,  సీఎం, డిప్యూటీ సీఎం దిగ్ర్భాంతి

అమరావతి, గవర్నర్‌, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంపై గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన ప్రయాణికులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని గవర్నర్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన తన సంతాపాన్ని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాదంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో పలువురు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. యూఏఈ పర్యటనలో ఉన్న సీఎం బస్సు దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే సీఎస్‌తోపాటు, జిల్లా కలెక్టర్‌ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు ఫోన్‌ చేశారు. ఉన్నతస్థాయి యంత్రాంగం అంతా ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని, క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. ఈ దుర్ఘటనపై మంత్రి లోకేశ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతి చెందటం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలకు ప్రభుత్వ పరంగా ఆదేశించామన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 06:05 AM