Suspension Extension: పీఎ్‌సఆర్, కాంతి రాణా సస్పెన్షన్ పొడిగింపు
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:42 AM
సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎ్‌సఆర్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ..
అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎ్‌సఆర్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ముంబైకి చెందిన సినీనటి కాదంబరి జెత్వానీపై అక్రమ కేసు బనాయించి ఆమెతోపాటు కుటుంబ సభ్యులను వేధించిన కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈ నెల 2న సమావేశమైన రివ్యూ కమిటీ కేసు దర్యాప్తుపై ఆరా తీసింది. ఇంకా పూర్తి కానందున సస్పెన్షన్ ఎత్తేస్తే సీనియర్ ఐపీఎస్ అధికారులు దర్యాప్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడింది. దీంతో 2025 మార్చి 8 వరకూ సస్పెన్షన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో సస్పెండైన మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ తనకు పోస్టింగ్ ఇప్పించాలంటూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.