Share News

Minister Kollu Ravindra: పరిశ్రమల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

ABN , Publish Date - Dec 15 , 2025 | 04:34 AM

రాష్ట్రంలో పరిశ్రమల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యాపార వాతావరణాన్ని పెంపొందించి, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికబద్దంగా అడుగులు...

Minister Kollu Ravindra: పరిశ్రమల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

  • మంత్రి కొల్లు రవీంద్ర

విజయవాడ సిటీ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పరిశ్రమల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యాపార వాతావరణాన్ని పెంపొందించి, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికబద్దంగా అడుగులు వేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడ ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాలులో జరుగుతున్న ఏపీ చాంబర్స్‌ బిజినెస్‌ ఎక్స్‌ పోను మంత్రి ఆదివారం సందర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఈ ఎక్స్‌ పో ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆటోమొబైల్‌, టెక్స్‌టైల్స్‌, టూరిజం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, రాష్ట్ర ప్రభుత్వ ఎంఎ్‌సఎంఈలకు చెందిన 157 స్టాల్స్‌ను ఏర్పాటు చేసి యువ పారిశ్రామి వేత్తల సందేహాలను తొలగించిన నిర్వాహకులను అభినందించారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని ఇండస్ట్రియల్‌ పార్క్‌లో పరిశ్రమల స్థాపనకు తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం పరంగా అందాల్సిన వసతులను కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఏపీ చాంబర్స్‌ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగిన ఈ ఎక్స్‌ పోను 30 వేల మంది సందర్శించినట్లు చెప్పారు.

Updated Date - Dec 15 , 2025 | 04:34 AM