Share News

Excise Department: బార్లకు నేడు రెండో విడత లాటరీ

ABN , Publish Date - Sep 18 , 2025 | 04:57 AM

ప్రభుత్వ బార్‌ పాలసీలో రెండో విడత లాటరీ ప్రక్రియ గురువారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ ఏర్పాట్లు చేసింది. రెండో విడతలో 428 బార్లకు నోటిఫికేషన్‌ జారీచేశారు.

Excise Department: బార్లకు నేడు రెండో విడత లాటరీ

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బార్‌ పాలసీలో రెండో విడత లాటరీ ప్రక్రియ గురువారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ ఏర్పాట్లు చేసింది. రెండో విడతలో 428 బార్లకు నోటిఫికేషన్‌ జారీచేశారు. దరఖాస్తులకు ఈనెల 14 వరకు గడువు ఇవ్వగా, ఆశించినన్ని రాకపోవడంతో గడువు పొడిగించారు. అయినప్పటికీ వంద బార్లకు కూడా 4 దరఖాస్తులు రాలేదు. నిబంధనల ప్రకారం 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తారు. బార్‌ పాలసీ నిబంధనలను సవరించాలని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సూచించారు. అందువల్లే ఈ మాత్రం దరఖాస్తులైనా వచ్చాయి. అప్పటి వరకు 30లోపే దరఖాస్తులు అందాయి. కాగా, బార్లకు సరఫరా చేసే మద్యంపై అదనంగా విధించిన ఏఆర్‌ఈటీ పన్ను తగ్గింపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం 15శాతం ఏఆర్‌ఈటీ ఉండగా, దానిని 6శాతం చేయాలని ఆలోచన చేస్తోంది. మిగిలిన 9శాతం ఏఆర్‌ఈటీని షాపులకు సర్దుబాటు చేస్తుంది.

Updated Date - Sep 18 , 2025 | 04:57 AM