పెట్టుబడిదారులకు ఏపీ భరోసా: పెమ్మసాని
ABN , Publish Date - Nov 15 , 2025 | 07:05 AM
పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి ఏపీ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
విశాఖపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి ఏపీ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. విశాఖ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ... టెలికాం రంగంలో 25 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు అవకాశాలున్నాయన్నారు. కొత్త కంపెనీలు, పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తే అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేయడానికి కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న పెట్టుబడి గమ్యస్థానాల్లో ఏపీ ఒకటన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం బలమైన పారిశ్రామిక వాతవరణాన్ని నిర్మించిందన్నారు. విశాఖపట్నం ఇండస్ర్టీ అండ్ ఫిన్‌టెక్, అనంతపురం ఆటోమొబైల్స్, తిరుపతి ఎలక్ర్టానిక్స్ రంగాలకు కేంద్రాలుగా మారనున్నాయన్నారు. తిరుపతి ఎలక్ర్టానిక్స్ రంగాలకు కేంద్రాలుగా మారనున్నాయన్నారు. యువ మంత్రులు లోకేశ్, టీజీ భరత్ వంటివారి నాయకత్వంలో ఏపీ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉందన్నారు.