Minister Savita: బీసీల అభ్యున్నతికి 47,456 కోట్లు
ABN , Publish Date - Nov 06 , 2025 | 05:36 AM
బీసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం రూ.47,456 కోట్లు కేటాయించిందని, ఇదొక చరిత్ర అని మంత్రి సవిత అన్నారు.
బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల ఆత్మీయ సమావేశంలో మంత్రి సవిత
అమరావతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): బీసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం రూ.47,456 కోట్లు కేటాయించిందని, ఇదొక చరిత్ర అని మంత్రి సవిత అన్నారు. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరక్టర్లతో మూడు రోజులపాటు నిర్వహించిన ఆత్మీయ సమావేశాలు బుధవారం ముగిశాయి. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్‌లో జరిగిన ముగింపు సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ.. ఆదరణ పథకాన్ని 3.0 పేరుతో మరోసారి ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దీనికోసం బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు.