School Education: పాఠశాల విద్యకు అథారిటీ ఏర్పాటు
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:28 AM
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ నూతన అథారిటీని తీసుకొచ్చింది.
విద్యలో నాణ్యత, ఫలితాలపై ప్రత్యేక దృష్టి
అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ నూతన అథారిటీని తీసుకొచ్చింది. ‘రాష్ట్ర పాఠశాల ప్రమాణాల అథారిటీ (ఎస్‌ఎ్‌సఎ్‌సఏ)ని ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. సెకండరీ విద్య బోర్డు... ఎస్‌ఎ్‌సఎ్‌సఏగా పనిచేస్తుందని తెలిపింది. ప్రధానంగా పాఠశాల విద్యలో నాణ్యత మదింపు, ఫ్రేమ్‌వర్క్‌పై అథారిటీ దృష్టి పెడుతుందని తెలిపింది. తద్వారా కనీస నాణ్యతా ప్రమాణాలు, పారదర్శకత, జవాబుదారీతనం, నాణ్యమైన విద్యకు హామీ లభిస్తుందని పేర్కొంది. ఈ అథారిటీకి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. వైస్ చైర్మన్‌గా ఆ శాఖ కమిషనర్, సభ్యులుగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి, సమగ్రశిక్ష ఎస్పీడీ, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌లు ఉంటారు. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. కొత్తగా ఏర్పాటు చేసిన అథారిటీ ఇంటర్మీడియట్ బోర్డు తరహాలో పనిచేస్తుంది. పాఠశాలలకు అనుమతులు, అభ్యసన ఫలితాలు, నాణ్యతను పర్యవేక్షిస్తుంది.