Share News

AP EdCET 2025: నేడు ఏపీ ఎడ్‌సెట్‌

ABN , Publish Date - Jun 05 , 2025 | 05:38 AM

ఏపీ ఎడ్‌సెట్‌-2025 కన్వీనర్‌ ఆచార్య ఏవీవీఎస్‌ స్వామి బుధవారం తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య జరిగే ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

AP EdCET 2025: నేడు ఏపీ ఎడ్‌సెట్‌

ఒక నిమిషం నిబంధన అమలు

పెదకాకాని, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరంలో బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్‌-2025 ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం ప్రొఫెసర్‌, ఏపీ ఎడ్‌సెట్‌-2025 కన్వీనర్‌ ఆచార్య ఏవీవీఎస్‌ స్వామి బుధవారం తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య జరిగే ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తారని, ఒక నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని వివరించారు.

Updated Date - Jun 05 , 2025 | 05:38 AM