Higher Education Council: మే 12 నుంచి ఈఏపీసెట్
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:05 AM
వచ్చే 2026- 27 విద్యా సంవత్సరంలో పలు కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూలును ఉన్నత విద్యామండలి సోమవారం విడుదల చేసింది.
7 రోజుల్లో 14 సెషన్ల నిర్వహణ
మే 4న లాసెట్, ఎడ్‌సెట్
ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదల
అమరావతి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): వచ్చే 2026- 27 విద్యా సంవత్సరంలో పలు కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూలును ఉన్నత విద్యామండలి సోమవారం విడుదల చేసింది. ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం ఈఏపీసెట్‌ను వచ్చే ఏడాది మే 12 నుంచి 18వ తేదీన మధ్య ఐదు రోజులు నిర్వహించనున్నట్లు తెలిపింది. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ పరీక్షలు 19, 20 తేదీల్లో జరుగుతాయని వెల్లడించింది. ఈ ఏడాది మే 19న ఈఏపీసెట్ పరీక్షలు ప్రారంభం కాగా, వచ్చే ఏడాది వారం ముందుగానే పరీక్షలు నిర్వహించేలా ఉన్నత విద్యామండలి ప్రణాళిక రూపొందించింది. అలాగే త్వరలో అడ్మిషన్ల షెడ్యూల్‌ను కూడా ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. ఆలస్యం జరుగుతుందనే విమర్శలు రాకుండా వచ్చే విద్యా సంవత్సరానికి ముందస్తు చర్యలు చేపట్టింది. కాగా ఎడ్‌సెట్, లాసెట్ మినహా మిగిలిన అన్ని ప్రవేశ పరీక్షలు రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరుగుతాయి.