AP DSC 2025: డీఎస్సీ తుది కీ విడుదల
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:37 AM
మెగా డీఎస్సీ పరీక్షల తుది కీ, ని డీఎస్సీ-2025 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఏపీ డీఎస్సీ వెబ్‌సైట్‌లో ‘కీ’ని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ పరీక్షల తుది ‘కీ’ని డీఎస్సీ-2025 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఏపీ డీఎస్సీ వెబ్‌సైట్‌లో ‘కీ’ని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి తుది ‘కీ’ రూపొందించామని, దీనిపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించే అవకాశం లేదని స్పష్టం చేశారు. కాగా, 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం జూన్ 6 నుంచి జూలై 2 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు.