Tadepalli: ఏపీ డీజీపీ గారి తాలూకా
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:53 AM
ఇప్పటి వరకు ద్విచక్రవాహనాలు, కార్లపై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, మంగళగిరి ఎమ్మెల్యే తాలూకా’ అని రాసి ఉండడాన్ని చూసి ఉంటాం.
జగన్ ఇంటి వద్ద కనిపించిన కానిస్టేబుల్ బైక్
తాడేపల్లి టౌన్, జూలై 22(ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు ద్విచక్రవాహనాలు, కార్లపై ‘పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’, ‘మంగళగిరి ఎమ్మెల్యే తాలూకా’ అని రాసి ఉండడాన్ని చూసి ఉంటాం. కానీ ఇందుకు భిన్నంగా ఓ పోలీసు కానిస్టేబుల్ తన బైక్ నంబరు ప్లేట్‌పై ‘ఏపీ డీజీపీ గారి తాలూకా’ అని ఉండటం పలువురిని ఆశ్చర్యపరిచింది. మంగళవారం ఈ వాహనం తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద కనిపించింది. ఈ బైక్ జగన్ ఇంటి వద్ద బందోబస్తు నిర్వహించేందుకు వచ్చిన అనంతపురం ఏపీఎస్పీ 14వ బెటాలియన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌దిగా తెలిసింది!. నంబరు ప్లేట్లు సక్రమంగా లేని వాహనాదారులకు ఫైన్లు విధించే పోలీసులే.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటన్న విమర్శలు వినిపించాయి