Share News

రైతన్నకు నష్టపరిహారం ప్రకటించండి: షర్మిల

ABN , Publish Date - Oct 26 , 2025 | 05:03 AM

వర్షానికి పంట నష్టపోయిన రైతన్నకు నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. రైతుకు జరిగిన నష్టంపై...

రైతన్నకు నష్టపరిహారం ప్రకటించండి: షర్మిల

అమరావతి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): వర్షానికి పంట నష్టపోయిన రైతన్నకు నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. రైతుకు జరిగిన నష్టంపై అంచనా వేసేందుకు వెంటనే ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయలతో పాటు ఇతర పంటలు పనికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు మునిగిపోయినట్లుగా ప్రభుత్వ అధికారులే లెక్కల్లో చెప్పారన్నారు. ప్రకాశం జిల్లాలో 14,000 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 8,000 ఎకరాలు, కోనసీమ జిల్లాలో 7,000 ఎకరాల్లో పంటలు మునిగినట్లుగా అధికారులు ప్రకటించారన్నారు. పంట నష్టం ఇంకా పెరుగుతోందన్నారు. 158 మండలాల్లో లక్షన్నర ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని షర్మిల వివరించారు.

Updated Date - Oct 26 , 2025 | 05:06 AM