AP Collectors Conference: 15,16 తేదీల్లో కలెక్టర్ల సదస్సు
ABN , Publish Date - Sep 13 , 2025 | 06:47 AM
ఈ నెల 15, 16 తేదీల్లో కలెక్టర్ల సదస్సును నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలపై ఈ భేటీలో సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఈ నెల 15, 16 తేదీల్లో కలెక్టర్ల సదస్సును నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలపై ఈ భేటీలో సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్ర వృద్ధి రేటును పెంచడం, జిల్లాల అభివృద్ధి గతిని మెరుగుపరచడంపై దృష్టి సారించనున్నారు. సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు సీ ఎస్ నేతృత్వంలో సాధారణ పరిపాలన శాఖ పర్యవేక్షిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది నాలుగో కలెక్టర్ల సదస్సు. చివరిగా ఈ ఏడాది మార్చి నెల 25, 26వ తేదీల్లో సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుతీరు, వృద్ధిపై ఈ సదస్సులో చర్చించనున్నారు.