Share News

Google Agreement: కూటమి నేతల సంబరాలు

ABN , Publish Date - Oct 15 , 2025 | 05:43 AM

గూగుల్‌ రాకతో విశాఖ పూర్తిస్థాయిలో డేటా హబ్‌గా రూపాంతరం చెందుతుందని, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయంటూ టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తంచేశారు.

Google Agreement: కూటమి నేతల సంబరాలు

విశాఖపట్నం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): గూగుల్‌ రాకతో విశాఖ పూర్తిస్థాయిలో డేటా హబ్‌గా రూపాంతరం చెందుతుందని, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయంటూ టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తంచేశారు. హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్‌ మంగళవారం ఒప్పందం చేసుకోవడంపై కూటమి నేతలు మంగళవారం విశాఖలో సంబరాలు చేసుకున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. సత్యం సెంటర్‌ జంక్షన్‌లో ఉత్తర నియోజకవర్గ బీజేపీ నాయకురాలు శ్యామలా దీపిక, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ కేకు కట్‌ చేసి కార్యకర్తలకు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గూగుల్‌ వల్ల 1.88 లక్షల మందికి దశల వారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. అంత పెద్ద సంస్థను విశాఖకు రప్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు నగర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Oct 15 , 2025 | 05:44 AM