Share News

బాధ్యతాయుత పాలన కూటమి విధానం: లంకా దినకర్‌

ABN , Publish Date - Sep 11 , 2025 | 06:02 AM

ఒకవైపు అనంతపురంలో సూపర్‌ సిక్స్‌ సభ సూపర్‌ హిట్‌గా జరుగుతుండగా, మరో వైపు సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ నుంచి నేపాల్‌లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజల...

బాధ్యతాయుత పాలన కూటమి విధానం: లంకా దినకర్‌

అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఒకవైపు అనంతపురంలో సూపర్‌ సిక్స్‌ సభ సూపర్‌ హిట్‌గా జరుగుతుండగా, మరో వైపు సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ నుంచి నేపాల్‌లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజల భద్రత కోసం కసరత్తు జరగడం సుపరిపాలనకు నిదర్శనమని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్‌ లంకా దినకర్‌ బుధవారం ఒక ప్రకటనలో అన్నారు. ‘ప్రజల ప్రాణాలు వాహన చక్రాల కింద నలిగినా పట్టించుకోని నాయకత్వం ఒకవైౖపు ఉంటే... విదేశాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించే నాయకత్వం మరోవైపు ఉంది. బీజేపీ, టీడీ పీ, జనసేనలు... బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లా త్రిమూర్తుల పాలన అందిస్తున్నాయి’ అని దినకర్‌ అన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 06:02 AM