Share News

CM House Construction: రాజధానిలో శరవేగంగా సీఎం సొంతిల్లు

ABN , Publish Date - Aug 02 , 2025 | 05:55 AM

రాజధానిలో నిర్మాణంలో ఉన్న తమ సొంత ఇంటి పనులను మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.

CM House Construction: రాజధానిలో శరవేగంగా సీఎం సొంతిల్లు

  • నిర్మాణ పనులు పరిశీలించిన తనయుడు లోకేశ్‌

తుళ్లూరు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాజధానిలో నిర్మాణంలో ఉన్న తమ సొంత ఇంటి పనులను మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. అసెంబ్లీ పడమర వైపు, ఈ- 6 రోడ్డు పక్కనే వెలగపూడికి చెందిన ఓ కుటుంబం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ఐదెకరాల భూమిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అందులో నాలుగు నెలల క్రితం కుటుంబ సమేతంగా శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. ఎస్‌ఆర్‌ఆర్‌ నిర్మాణ సంస్థ సీఎం ఇంటి నిర్మాణ పనులను చేపట్టింది. పెద్ద సంఖ్యలో కార్మికులను రంగంలోకి దించి శరవేగంగా పనులు చేపడుతోంది. ఈ క్రమంలో పనులు ఏ విధంగా సాగుతున్నాయో లోకేశ్‌ పరిశీలించారు. 40 నిమిషాల పాటు కంపెనీ వారితో చర్చించి వెళ్లారు.

Updated Date - Aug 02 , 2025 | 05:55 AM