Share News

AP CM Chandrababu: రాజధానిలో కార్యాలయాలు పెట్టండి

ABN , Publish Date - Sep 24 , 2025 | 04:07 AM

అమరావతిలో ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించాలని, అలాగే రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని బ్యాంకుల చైర్మన్లు, ఎండీలను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

AP CM Chandrababu: రాజధానిలో కార్యాలయాలు పెట్టండి

  • రాష్ట్ర ప్రాజెక్టుల్లో భాగస్వాములుకండి

  • బ్యాంకుల చైర్మన్లు, ఎండీలను కోరిన సీఎం

  • రాష్ట్ర ప్రాజెక్టుల్లో భాగస్వాములవ్వండి.. బ్యాంకుల చైర్మన్లు, ఎండీలను కోరిన సీఎం

అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): అమరావతిలో ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించాలని, అలాగే రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని బ్యాంకుల చైర్మన్లు, ఎండీలను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. లోక్‌సభ సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ సమావేశంలో భాగంగా విజయవాడకు వచ్చిన పలు బ్యాంకుల చైర్మన్లు, ఎండీలకు సీఎం తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం హైటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులను వారికి వివరించారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తున్నందున విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని బ్యాంకుల ఉన్నతాధికారులను సీఎం కోరారు. ఇప్పటికే వివిధ బ్యాంకులకు రాజధానిలో స్థలాలు కేటాయించామని, అక్కడ ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటును ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. 15 నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, కేంద్ర సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను సీఎం వివరించారు. అన్ని రంగాల్లో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, నారాయణ, ఎంపీ బాలశౌరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 04:08 AM