Share News

AP CM Chandrababu Naidu: నాటికి నంబర్‌వన్‌ ఆర్థిక వ్యవస్థగా భారత్‌

ABN , Publish Date - Dec 28 , 2025 | 04:48 AM

ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి భారతదేశం ఎదుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

AP CM Chandrababu Naidu: నాటికి నంబర్‌వన్‌ ఆర్థిక వ్యవస్థగా భారత్‌

  • యువత అధికంగా ఉన్నది మన దేశంలోనే

  • దేశంలో హైక్లా్‌సకు చిరునామాగా 2 రాష్ర్టాలు

  • 2040 నాటికి దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉండాలి: చంద్రబాబు

  • హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ విద్యాసంస్థల వార్షికోత్సవానికి హాజరు

చేవెళ్ల/మొయినాబాద్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి భారతదేశం ఎదుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌లో శనివారం ఎన్టీఆర్‌ విద్యాసంస్థల వార్షికోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచంలోనే అఽధికంగా యు వత ఉన్నది భారత్‌లోనే అన్నారు. 2047 సంవత్సరానికి వికసిత్‌ భారత్‌గా తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు. దేశంలోనే హైక్లా్‌సకు చిరునామాగా తెలుగు రాష్ర్టాలు తయారవడం గౌరవంగా ఉందన్నారు. దేశంలో నాల్గవ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాయని, 2038 నాటికి మూడవ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాయని తెలిపారు. 2040 నాటికి దేశంలోనే ఏపీ, తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఆ రోజుల్లోనే హైదరాబాద్‌ విజన్‌-2020ని విడుదల చేస్తే చాలామంది ఎగతాళి చేయగా, ఈరోజు అది రెట్టింపుగా తయారైందన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాల విద్యార్థులు హైదరాబాద్‌కు వచ్చి చదువుకునే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో విద్యాసంస్థలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.


పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండాలనే..

‘గండిపేటలోని ఎన్టీఆర్‌ విద్యా సంస్థకు వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది’ అని చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉండేదని, ఇక్కడ పార్టీ నేతలకు శిక్షణ ఇచ్చేవార ని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఈ స్థలంలో పిల్లలకు చదువు నేర్పుతున్నారని తెలిపారు. ‘రకరకాల కార ణాల వల్ల చాలా మంది పిల్లలు అనాథలుగా మారేవారు. ఆ పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండాలనే ఈ విద్యాసంస్థలను ఏర్పాటు చేశాం. ఆనాడు నాటి చిన్న మొక్క ఇవాళ పెద్ద వృక్షంగా తయారైంది. ఈ విద్యా సంస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఘనత ట్రస్ట్‌ చైర్మన్‌ భువనేశ్వరిదే’ అని కొనియాడారు. ఇక్కడ చదువుకున్న నలుగురు గ్రూప్‌ వన్‌ పోస్టులు సాధించారని, ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో 29మంది సీ ట్లు పొందారని తెలిపారు. ప్రస్తు తం 1641 మంది పిల్లలు చదువుతున్నారని, చిన్న పాఠశాలగా మొద లై ఇంటర్‌, డిగ్రీ కాలేజీ వరకు ఈ సంస్థ ఎదిగిందని చెప్పారు. హైటెక్‌సిటీ కట్టి ఐటీని ప్రోత్సహించానని, ఈ రోజు మళ్లీ డేటా సెంటర్‌, ఏఐ, క్వాంటమ్‌ వ్యాలీ, క్వాం టమ్‌ కంప్యూటర్స్‌, గ్రీన్‌ఎనర్జీ, సెమీ కండక్టర్‌, డ్రోన్‌, స్పేస్‌ టెక్నాలజీలకి చిరునామా గా ఏపీని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో విద్యాసంస్థల సీఈవో రాజేందర్‌ ప్రసాద్‌, సీఏఓఓ గోపీ, డైరెక్టర్‌ వేంకటేశ్వర్లు, డీన్‌ రామారావు, ప్రిన్సిపాల్‌ ఎస్‌జే రెడ్డి, హెరిటేజ్‌ డైరెక్టర్‌ సాంబశివరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


  • నేడు అయోధ్యకు సీఎం చంద్రబాబు

  • ఎల్లుండి విదేశీ పర్యటనకు...

అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం అయోధ్యకు వెళుతున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి 11 గంటలకు అయోధ్య చేరుకుంటారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి క్లాంప్లెక్స్‌లో కొలువైన శ్రీరాముడిని దర్శించుకుంటారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు మూడు గంటలపాటు అయోధ్య శ్రీరాముడి ఆలయంలో సీఎం ఉంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి నేరుగా అమరావతి చేరుకుంటారు. కాగా, డిసెంబరు 30 నుంచి ఆయన విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో వ్యక్తిగత పర్యటనకు వెళుతున్న బాబు తిరిగి జనవరి 4న రాష్ట్రానికి వస్తారు.

Updated Date - Dec 28 , 2025 | 04:51 AM