PM Modi: బాబూ.. మీ హిందీ భేష్
ABN , Publish Date - Oct 17 , 2025 | 05:11 AM
కర్నూ లు సభలో సీఎం చంద్రబాబు హిందీలో చేసిన ప్రసంగంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.
బిహార్ విజయంపై మాట్లాడి ఎన్డీయే కార్యకర్తల హృదయాలు గెలిచారు
‘ఎక్స్’లో ప్రధాని మోదీ ప్రశంస
అమరావతి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): కర్నూ లు సభలో సీఎం చంద్రబాబు హిందీలో చేసిన ప్రసంగంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. మంచి హిందీ మాట్లాడారంటూ చంద్రబాబును అభినందించారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తూ మోదీ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘బిహార్‌లో విజయావకాశాలపై మంచి హిందీలో ప్రసంగించడం ద్వారా ఎన్డీయే కార్యకర్తల హృదయాలను చంద్రబాబు గెలుచుకున్నారు. ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్’ పట్ల గాఢమైన తన నిబద్ధతను ఆయన చాటుకున్నారు’’ అని మోదీ పేర్కొన్నారు.
లోకేశ్‌కు మోదీ అభినందనలు
‘సూపర్ జీఎస్టీ...సూపర్ సేవింగ్స్..’ ప్రచార ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి మంత్రి లోకేశ్ విజయవంతం చేయడంపై ప్రధాని మోదీ హర్షం ప్రకటించారు. వినూత్నమైన పోటీలు, ప్రచారం ద్వారా యువత జీఎ్‌సటీ గురించి అర్థం చేసుకునేలా ప్రత్యేక కృషి చేశారంటూ ‘ఎక్స్’లో ఆయన అభినందించారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ.. ‘‘జీఎస్టీ సంస్కరణల వల్ల పన్నుల విధానంలో మార్పులొచ్చి దేశానికి ఆదాయం పెరుగుతోంది. ఇంత మంచి కార్యక్రమం తలపెట్టినందుకు మా రాష్ట్ర ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు’’ అంటూ లోకేశ్ స్పందించారు.