ACB Court: బాబు కేసుల పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
ABN , Publish Date - Dec 23 , 2025 | 05:47 AM
వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుపై నమోదైన కేసులకు సంబంధించి ఇచ్చిన తీర్పుల ప్రతులివ్వాలంటూ దాఖలైన వ్యాజ్యంపై..
విజయవాడ, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుపై నమోదైన కేసులకు సంబంధించి ఇచ్చిన తీర్పుల ప్రతులివ్వాలంటూ దాఖలైన వ్యాజ్యంపై సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్, రైల్వే విశ్రాంత ఉద్యోగి వేము కొండలరావు తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. మూడో పార్టీగా ఉన్న వ్యక్తి ఏదైనా కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను కోరుతూ కోర్టును ఆశ్రయించినప్పుడు వాటిని అందజేయాలని తీర్పులు ఉన్నాయన్నారు. అయితే కేసుతో సంబంధం లేని వ్యక్తులకు ఇటువంటి డాక్యుమెంట్లను ఇవ్వాల్సిన అవసరం లేదని సీఐడీ తరఫు సీనియర్ కౌన్సిల్ అఖిల్ పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలను విన్న అనంతరం న్యాయాధికారి భాస్కరరావు తదుపరి విచారణను 24కి వాయిదా వేశారు.