AP CM Chandrababu: మొక్కజొన్న రైతులను ఆదుకోండి
ABN , Publish Date - Dec 03 , 2025 | 06:10 AM
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26కు సంబంధించి ఏపీలో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ధర కింద మొక్కజొన్న సేకరణకు సాయం అందించాలని...
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం లేఖ
ఢిల్లీలో అందజేసిన రామ్మోహన్,లావు
న్యూఢిల్లీ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26కు సంబంధించి ఏపీలో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ధర కింద మొక్కజొన్న సేకరణకు సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కేంద్ర లేదా రాష్ట్ర ఏజెన్సీల ద్వారా ఎంఎస్‌పీ ధరకు మొక్కజొన్న సేకరణకు అనుమతించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఆయన లేఖ రాశారు. ఆ లేఖను కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, టీడీపీపీ నేత శ్రీకృష్ణదేవరాయలు ప్రహ్లాద్‌జోషికి అందజేశారు. 3,25,134 టన్నుల మొక్కజొన్ననుసేకరించాలని ఆ లేఖలో కేంద్ర మంత్రిని సీఎం కోరారు.