Share News

AP Chambers of Commerce urged Finance Minister Nirmala Sitharaman: ఉత్పాదకత పెంపునకు సహకరించండి

ABN , Publish Date - Nov 29 , 2025 | 04:53 AM

ప్రపంచంతో పోటీ పడేలా దేశీయ ఉత్పాదకతను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏపీ...

AP Chambers of Commerce urged Finance Minister Nirmala Sitharaman: ఉత్పాదకత పెంపునకు  సహకరించండి

  • కేంద్ర మంత్రి నిర్మలకు ఏపీ చాంబర్స్‌ ప్రతిపాదనలు

అమరావతి, విజయవాడ సిటీ, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రపంచంతో పోటీ పడేలా దేశీయ ఉత్పాదకతను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏపీ చాంబర్స్‌ ప్రతినిధులు పొట్లూరిభాస్కరరావు, బి.రాజశేఖర్‌, ఆర్‌.వి.స్వామి, మురళీకృష్ణ వినతిపత్రాన్ని ఇచ్చారు. ప్రపంచ స్థాయి పోటీ తత్వాన్ని దేశంలో పెంచడానికి డిజిటల్‌ ఆటోమేషన్‌, ఏఐ, రోబోటిక్‌, ఇంధన ఆదా పరికరాల ఉత్పత్తి, మౌళిక పరీక్ష సదుపాయాలను ప్రోత్సహించాలని కోరారు.

ఆతిథ్య రంగానికి ఐటీసీ ప్రయోజనాలు పునరుద్ధరించండి

అతిథ్య రంగానికి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌(ఐటీసీ) ప్రయోజనాలను పునరుద్ధరించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్‌ను ఏపీ స్టార్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.వి.స్వామి, సలహాదారు ఎం.మురళీ కోరారు. ఐటీసీ ప్రయోజనాలు లేకుండా హాస్పిటాలిటీ రంగం 5 శాతం జీఎస్టీని చెల్లిస్తుందని, దీని కారణంగా పెట్టుబడుల ఖర్చు పెరిగి రాబడి తగ్గుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 04:53 AM