Drug Crackdown: గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపండి
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:48 AM
రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాల సరఫరా నెట్‌వర్క్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి నియంత్రించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.
మంత్రివర్గ ఉపసంఘం
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాల సరఫరా నెట్‌వర్క్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి నియంత్రించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణకు పలు కీలక సూచనలు చేసింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం హోం మంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో మంత్రులు లోకేశ్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, గుమ్మిడి సంధ్యారాణితో కూడిన కమిటీ సమావేశమైంది.