Share News

Cabinet Sub Committee: స్వర్ణాంధ్ర 2047 సాధనకు ప్రణాళికలు

ABN , Publish Date - Oct 14 , 2025 | 06:41 AM

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యసాధన కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఆదాయ వనరుల సమీకరణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని...

Cabinet Sub Committee: స్వర్ణాంధ్ర 2047 సాధనకు ప్రణాళికలు

  • వనరుల సమీకరణకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ

అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర-2047 లక్ష్యసాధన కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఆదాయ వనరుల సమీకరణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం జీవో ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రరెవెన్యూలో సింహభాగం జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపుల కోసమే ఖర్చవుతోందని, దీంతో సంక్షేమం, అభివృద్ధి కార్యకలాపాల కోసం ఆదాయం పెద్దగా అందుబాటులో ఉండడం లేదని జీవోలో పేర్కొంది. ఈ కమిటీలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్‌, సత్యకుమార్‌, కందుల దుర్గేష్‌, అనిత సభ్యులుగా, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. ఈ కమిటీ నెలకోసారి సమావేశమై రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ప్రతిపాదనలపై చర్చించి వాటిని ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. అలాగే, స్వర్ణాంధ్ర- 2047 సాధన కోసం మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

Updated Date - Oct 14 , 2025 | 06:41 AM