AP Cabinet: క్వాంటమ్ హబ్ భవన నిర్మాణ టెండర్లకు అనుమతి
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:20 AM
రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్‌కు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీని భవన నిర్మాణానికి టెండర్లను పిలిచేందుకు కూడా క్యాబినెట్ సమ్మతించింది.
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్‌కు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీని భవన నిర్మాణానికి టెండర్లను పిలిచేందుకు కూడా క్యాబినెట్ సమ్మతించింది. ప్రభుత్వం నిర్మించే భవనానికి ఐబీఎం సంస్థ అద్దె చెల్లిస్తుంది. జనవరి ఒకటి నుంచి క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల కోసం ఇంటర్నెట్‌తో సహా సాంకేతిక సహకారాన్ని ఐబీఎం ఉచితంగా అందిస్తుంది. ఈ సేవలను రాష్ట్ర ప్రభుత్వ శాఖల సేవల కోసం ఐటీ శాఖ వినియోగించుకుంటుంది. ఇక క్వాంటమ్ హబ్‌కు క్యాబినెట్ ఆమోదం లభించడంతో అమరావతిలో ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన భవన నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖ సిద్ధమైంది.