AP Cabinet: క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌గా ఏపీ.. బిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యం
ABN , Publish Date - Nov 10 , 2025 | 06:58 PM
ఏపీ క్యాబినెట్ ఇవాళ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్వాంటం కంప్యూటింగ్‌కు ఏపీ కేంద్రంగా మారబోతోందని.. ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమని..
అమరావతి, నవంబర్ 10: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ ఇవాళ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ మంత్రివర్గ సమావేశంలో.. అజెండాలోని 70 అంశాలపై చర్చించారు.
క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. క్వాంటం కంప్యూటింగ్ సంస్థలు, సాంకేతిక నిపుణులు, క్వాంటం కంప్యూటింగ్ విడిభాగాల సంస్థలకు ఏపీ కేంద్రంగా మారబోతోందని మంత్రి చెప్పారు. ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించడమే క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ లక్ష్యమని, భారీగా స్టార్టప్‌లు రాష్ట్రానికి వస్తాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
ఏపీ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు:
దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే ప్రతిపాదనలను ఏపీ క్యాబినెట్ ఆమోదం
క్వాంటం కంప్యూటింగ్ విధానానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
నేషనల్ క్వాంటం మిషన్‌తో మేధావులను అనుసంధానించుకుంటూ సాగే విధానం
క్వాంటం కంప్యూటింగ్ విడిభాగాలు తయారు చేసే సంస్థలు, నిపుణులకు కేంద్రంగా ఏపీ
క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం వల్ల, స్టార్టప్‌లు పెద్దఎత్తున రాష్ట్రానికి వస్తాయని ఆశాభావం
1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే క్వాంటం కంప్యూటింగ్ మిషన్ అమలు లక్ష్యం
5 వేల మందికి పైగా నైపుణ్యం కలిగిన నిపుణులు రాష్ట్రానికి రాక
రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ అనుసంధాన స్పేర్ వర్క్ స్టేషన్లు ఏర్పాటుకు ఆమోదం
ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం
వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వ ఆర్ధిక సాయం
విశాఖలో పలు ఐటీ సంస్థల ఏర్పాటు ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం
విశాఖలో రియాల్టీ లిమిటెడ్.. 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్క్ ఏర్పాటుకు ఆమోదం
విశాఖలో రహేజా సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం
విశాఖలో రుషికొండ, కాపులుప్పాడలో పలు పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం
తిరుపతి, ఓర్వకల్‌లో పలు పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం
ఓర్వకల్లు డ్రోన్ సిటీలో 50 ఎకరాల్లో డెడికేటెడ్ డ్రోన్ ఇండస్ట్రియల్ ఏర్పాటుకు ఆమోదం
బిర్లా గ్రూప్‌కు నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు కోసం భూమి కేటాయింపు
ఓర్వకల్లులో సిగాచి ఇండస్ట్రియల్ లిమిటెడ్ సింథటిక్ ఆర్గానిక్ ప్లాంట్ కోసం 100 ఎకరాల భూమి కేటాయింపు
అనకాపల్లి జిల్లాలో డోస్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు 150 ఎకరాల భూమి కేటాయింపు
కృష్ణా జిల్లా బాపులపాడులో 40 ఎకరాల్లో వేద ఇన్నోవేషన్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం
సుగుణ గ్రూప్ ఆధ్వర్యంలో అనంతపురంలో టీఎంటీ బార్స్ తయారు చేసే ప్లాంట్ కోసం 300 ఎకరాల భూమి కేటాయింపు
అసైన్డ్ భూముల (బదిలీ నిషిద్ధ) చట్టం సవరణ బిల్లుకు ఆమోదం
అసైన్డ్ భూములను అవసరాలకోసం 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ సవరణ
విమానాశ్రయ అభివృద్ది సంస్థకు హడ్కో ద్వారా లోన్ ఇప్పించేందుకు ప్రభుత్వ హామీ ఇచ్చేందుకు ఆమోదం
కుప్పం, దగదర్తిలో విమానాశ్రయాల ఏర్పాటు కోసం వెయ్యి కోట్లు రుణం తీసుకునేందుకు హామీ ఇవ్వాలని నిర్ణయం
విశాఖలో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం
అమరావతిలో ఉండవల్లి వద్ద మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం
పంపింగ్ స్టేషన్ నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్, ఎడీబీ బ్యాంక్ ద్వారా రూ. 595 కోట్లు రుణం తీసుకునేందుకు పరిపాలనాపరమైన ఆమోదం
కృష్ణయ్యపాలెం, వెంకటపాలెం, పెనుమాకలో రోడ్లు, డ్రైనేజీలు, సదుపాయాల కల్పన కోసం రూ.1863 కోట్లతో కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ఆమోదం
జీవిత ఖైదు పడిన ముగ్గురు ఖైదీలకు క్షమాబిక్ష ప్రసాదించే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం
సంతమాగలూరులో 1000 ఎకరాల స్థలంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం
కర్నూలు జిల్లా హోళగుంద, ఆలూరులో 2 మెగావాట్‌ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం
ఎపీపీఎఫ్‌సీఎల్ కు పలు సంస్థల ద్వారా 5 వేల కోట్ల రుణాలు పొందేందుకు క్యాబినెట్ ఆమోదం
ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటుకు భూమిని హ్యాండ్లూమ్ శాఖకు అద్దెకి ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులు, కౌలు రైతులకు ఆర్ధిక సాయం కింద రాష్ట్రం రూ.14 వేలు, కేంద్రం రూ. 6 వేలు ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం
తిరుపతి రూరల్ వావిలాల గ్రామంలో 2 ఎకరాలను టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి లీజు ఇచ్చేందుకు ఆమోదం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.0 లో 100 ఎకరాల భూమిని ఎపీ టిడ్కోకి ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం
మచిలీపట్నం సమీపం మాచవరంలో 1.60 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ కృష్ణ జిల్లా శాఖకు కేటాయింపునకు ఆమోదం
నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలకు ఇచ్చిన భూమిని లీజు 33 నుంచి 66 లేదా 99 ఏళ్లకు పెంచే సవరణకు మంత్రివర్గం ఆమోదం
రెవెన్యూ వ్యవస్థలో ఫిర్యాదులు లేకుండా పని చేయాలని సీఎం ఆదేశాలు
మొంథా తుఫానులో ప్రజా ప్రతినిధులు కష్టపడి పనిచేశారని సీఎం కితాబు