AP BJP President Madhav: పిల్ల, నకిలీ కాంగ్రెస్‌లను రాష్ట్రంలో లేకుండా చేయండి
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:59 AM
‘పిల్ల కాంగ్రెస్ వైసీపీ... గత ఐదేళ్ల దుష్ట, దుర్మార్గ పాలనలో రాష్ట్రాన్ని దోచేసింది. పిల్ల కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్ రాష్ట్రంలో వేళ్లూనుకోకుండా చేయాల్సిన బాధ్యత...
బీజేపీ శ్రేణులకు మాధవ్ పిలుపు
రాజమహేంద్రవరం అర్బన్, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ‘పిల్ల కాంగ్రెస్ వైసీపీ... గత ఐదేళ్ల దుష్ట, దుర్మార్గ పాలనలో రాష్ట్రాన్ని దోచేసింది. పిల్ల కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్ రాష్ట్రంలో వేళ్లూనుకోకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన బీజేపీ జిల్లా స్థాయి విస్తృత సభలో ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీ దేశానికి తీరని అన్యాయం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని సభ్యసమాజం తలదించుకునేలా దూషించిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన రాజకీయ నాయకుడిగా అనర్హుడు’ అన్నారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.