Share News

AP BJP President Madhav: నేను జాతీయవాదిని

ABN , Publish Date - Jul 13 , 2025 | 05:54 AM

నేను జాతీయవాదిని. తెలంగాణ పట్ల, ఇక్కడి గొప్ప సంస్కృతి పట్ల నాకున్న గౌరవం రాజకీయ విమర్శలకు అతీతం. తెలంగాణ పట్ల నాకున్న గౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు. అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ స్పష్టం చేశారు.

AP BJP President Madhav: నేను జాతీయవాదిని

  • తెలంగాణ, ఆ రాష్ట్ర సంస్కృతి పట్ల గౌరవం ఉంది

  • ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌

హైదరాబాద్‌, జూలై 12(ఆంధ్రజ్యోతి): ‘‘నేను జాతీయవాదిని. తెలంగాణ పట్ల, ఇక్కడి గొప్ప సంస్కృతి పట్ల నాకున్న గౌరవం రాజకీయ విమర్శలకు అతీతం. తెలంగాణ పట్ల నాకున్న గౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు.’’ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ స్పష్టం చేశారు. రజాకార్లను పొగిడే నిజాం వారసుల ముందు తలవంచిన వారికి తెలంగాణ ప్రజల హృదయా ల్లో ప్రతిఫలించే సంస్కృతి, జాతీయత, సమాన త్వం అనే విలువలు ఎప్పటికీ అర్థం కావని అన్నారు. ఏపీ మంత్రి లోకేశ్‌కు బహూకరించిన అఖండ భారత్‌ చిత్రపటంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. శనివారం హైదరాబాద్‌ వచ్చిన మాధవ్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావును కలుసుకున్నారు. భారతీయ సాంస్కృతిక వైభవానికి సంబంధించి న చిత్రాన్ని మాధవ్‌.. రాంచందర్‌రావుకు బహూకరించారు. ‘‘తెలుగు వారి ఐక్యతపై రాజకీయ గీతలు వేసేవారు చరిత్ర ముందు లొంగాల్సిందే. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేవారిని ప్రజలు జ్ఞాపకం ఉంచుకుంటారు. తెలంగాణ, ఆంధ్ర ప్ర జల మధ్య బంధాన్ని చీల్చే ప్రయత్నాలు వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం’’ అన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 05:56 AM