AP BJP Leaders: సుపరిపాలన యాత్ర ముగింపు సభకు రండి
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:42 AM
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శత జయంతి సందర్భంగా అమరావతిలో ఈ నెల 25న నిర్వహించనున్న అటల్-మోదీ సుపరిపాలన యాత్ర...
అమిత్ షాకు బీజేపీ ఏపీ నేతల వినతి
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్‌తో భేటీ
న్యూఢిల్లీ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శత జయంతి సందర్భంగా అమరావతిలో ఈ నెల 25న నిర్వహించనున్న అటల్-మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభకు రావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఏపీ బీజేపీ నేతలు కోరారు. బుధవారం, పార్లమెంటులోని అమిత్ షా కార్యాలయంలో ఆయనతో బీజేపీ స్టేట్ చీఫ్ పీవీఎన్ మాధవ్, కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం, ఇటీవల బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్‌ను మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.