జాషువా గొప్ప దేశ భక్తుడు: బీజేపీ చీఫ్ మాధవ్
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:47 AM
గుర్రం జాషువా గొప్ప దేశభక్తుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ అన్నారు.
విజయవాడలో గుర్రం జాషువా జయంతి
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): గుర్రం జాషువా గొప్ప దేశభక్తుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుర్రం జాషువా జయంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సమరసతా స్వరం.. జాతీయతా గళం పేరుతో గుర్రం జాషువా జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు భాషలో జాతీయ కవులు లేరా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు జాతీ య స్థాయి కవిగా జాషువా ఆయనంటే ఏమిటో ఆయన రచనల ద్వారా తెలుస్తుందన్నారు. గుర్రం జాషువా గొప్ప దేశ భక్తుడని, జాతి యావత్తు గుర్తుంచుకునేలా రచనలు చేసిన మహోన్నత వ్యక్తి అని సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ శ్లాఘించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ జాషువా కవితా సౌరభం వెలకట్టలేనిదని, జాషువా ఆశించింది నేడు బీజేపీ చేస్తోందని తెలిపారు.