Share News

Assistant Public Prosecutor: అక్టోబరు 5న ఏపీపీ రాత పరీక్షలు

ABN , Publish Date - Sep 27 , 2025 | 05:07 AM

అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకానికి అక్టోబరు 5న రెండు విడతల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌...

Assistant Public Prosecutor: అక్టోబరు 5న ఏపీపీ రాత పరీక్షలు

అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకానికి అక్టోబరు 5న రెండు విడతల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేపర్‌-1 ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ నెల 28 నుంచి బోర్డు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. 42 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టుల కోసం పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆగస్టు 4న నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ పోస్టుల కోసం 2103 దరఖాస్తులు అందాయని, 1139 మంది పురుషులు, 964 మంది మహిళా అభ్యర్థులు ఈ రాత పరీక్షలకు హాజరు కానున్నారని పేర్కొన్నారు.

Updated Date - Sep 27 , 2025 | 05:08 AM