Share News

AP AIMS 2.0: రైతులకు ఆసరాగా ఏపీ ఎయిమ్స్‌ 2.0

ABN , Publish Date - Sep 21 , 2025 | 05:30 AM

సామూహికంగా రైతుల ఫోన్లకు సూచనలు, సలహాలు పంపించే వ్యవస్థను వ్యవసాయ శాఖ రూపొందించింది.

AP AIMS 2.0: రైతులకు ఆసరాగా ఏపీ ఎయిమ్స్‌ 2.0

సలహా, సూచనలతో అన్నదాతల ఫోన్లకు సంక్షిప్త సందేశాలు

ఇంటర్నెట్ డెస్క్: సామూహికంగా రైతుల ఫోన్లకు సూచనలు, సలహాలు పంపించే వ్యవస్థను వ్యవసాయ శాఖ రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ సమాచార యాజమాన్య వ్యవస్థ.. ఏపీ ఎయిమ్స్‌-2.0 అని దీనికి పేరు పెట్టింది. దీనిద్వారా ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంక్షిప్త సందేశాలను ‘బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ పుష్‌’ ప్రక్రియద్వారా పంపుతారు. శనివారం ఆ శాఖ డైరెక్టర్‌ డిల్లీరావు ఈ ప్రక్రియను ప్రారంభించారు. వాసర్‌ లాబ్స్‌ అభివృద్ధి చేసిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా రియల్‌ టైమ్‌లో రైతులకు ఎస్‌ఎంఎస్‌లు రానున్నాయి. ఆండ్రాయిడ్‌, యాపిల్‌ ఫోన్లకే ఈ ఎస్‌ఎంఎస్‌లు పరిమితం కాకుండా, సాధారణ ఫోన్లకు కూడా వస్తాయని అధికారులు తెలిపారు.

Updated Date - Sep 21 , 2025 | 05:31 AM