Share News

Everest Base Camp: ఎల్‌బ్రస్‌ పర్వతంపై విజయవాడ వాసి

ABN , Publish Date - Aug 09 , 2025 | 06:03 AM

అరవై ఏడేళ్ల వయసులో యూర్‌పలోని అత్యంత ఎత్తయిన ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించారు విజయవాడ వాసి అనుమోలు ప్రభాకరరావు.

Everest Base Camp: ఎల్‌బ్రస్‌ పర్వతంపై విజయవాడ వాసి

  • అరవై ఏడేళ్ల వయసులో యూర్‌పలో అత్యున్నత శిఖరాన్ని ఎక్కిన ప్రభాకరరావు

పెనమలూరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): అరవై ఏడేళ్ల వయసులో యూర్‌పలోని అత్యంత ఎత్తయిన ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించారు విజయవాడ వాసి అనుమోలు ప్రభాకరరావు. 5,642 మీటర్ల ఎత్తున్న ఈ శిఖరంపై టీడీపీ జెండాను ఎగురవేశారు.కృష్ణా జిల్లా పోరంకికి చెందిన ప్రభాకరరావు (67) ఈ నెల 1న విజయవాడలో బయల్దేరి 2న రష్యాలోని మినెరల్నీ వోడీ పట్టణానికి చేరుకొన్నారు.అక్కడి నుంచి ఆయన అధిరోహించాల్సిన పర్వతానికి సమీపంలోని అజోవ్‌ గ్రామానికి వెళ్లి అక్కడ రెండు రోజులపాటు అభ్యాసం చేశారు. ఆగస్టు 4న బేస్‌ క్యాంపు వైపు ప్రయాణించి అక్కడి వాతావరణానికి పూర్తిగా అలవాటు పడిన అనంతరం 6వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు.తన పర్వతారోహణ ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ప్రభాకరరావు అభివర్ణించారు. 2024లో ఆయన ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం,2023లో ఎవరెస్టు బేస్‌ క్యాంపు వరకు ట్రెక్కింగ్‌ చేశారు.అనుమోలుతో పాటు పోరంకి వాసి బొబ్బా గోపాలకృష్ణ కూడా ఈ సాహస యాత్రలో పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2025 | 06:05 AM