Share News

Imaginovate Technologies: విశాఖకు మరో ఐటీ కంపెనీ

ABN , Publish Date - Oct 14 , 2025 | 05:48 AM

విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు, ఐటీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చే సంస్థలకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ప్రోత్సాహకాలు అందిస్తోంది.

Imaginovate Technologies: విశాఖకు మరో ఐటీ కంపెనీ

  • ఇమేజినోవేట్‌ టెక్నాలజీస్ (ఇండియా)కు 4.05 ఎకరాలు

అమరావతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు, ఐటీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చే సంస్థలకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందులో భాగంగా రూ.140 కోట్ల పెట్టుబడితో 2,600 మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రతిపాదనలు పంపిన ఇమేజినోవేట్‌ టెక్నాలజీస్‌ (ఇండియా)కు కాపులుప్పాడలో 4.05 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీఐటీ అండ్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌(జీసీసీ) పాలసీ 2024-29 ప్రాతిపదికన ఎకరా రూ.2 కోట్లు చొప్పున భూమి కేటాయించినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. తమ సంస్థకు బహిరంగ మార్కెట్‌ ధరకు కాకుండా పాలసీ ప్రకారం ఎకరా రూ.2 కోట్లకు కేటాయించాలని చేసిన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించినట్లు భాస్కర్‌ వెల్లడించారు.

Updated Date - Oct 14 , 2025 | 05:50 AM