State Development Purpose: అమరావతికి మరో 1,750 కోట్లు
ABN , Publish Date - Oct 24 , 2025 | 05:02 AM
రాజధాని అభివృద్ధి పనుల కోసం ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది డిసెంబరు నాటికి రెండో విడతగా 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,750 కోట్లు) విడుదల చేసే అవకాశం ఉందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్...
డిసెంబరు నాటికి ప్రపంచ బ్యాంకు విడుదల
ఇప్పటికే మొదటి విడతగా రూ.1,800 కోట్లు
విజయవాడ, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రాజధాని అభివృద్ధి పనుల కోసం ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది డిసెంబరు నాటికి రెండో విడతగా 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,750 కోట్లు) విడుదల చేసే అవకాశం ఉందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ గురువారం వెల్లడించారు. అమరావతిలో మొదటిదశ అభివృద్ధిలో భాగంగా తలపెట్టే ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకుతో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) 800 మిలియన్ డాలర్ల చొప్పున మొత్తం 1,600మిలియన్ డాలర్లు (సుమారు రూ.13,600 కోట్లు) ఫండింగ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రపంచబ్యాంకు ఇప్పటికే తొలివిడతలో సుమారు రూ.1800 కోట్లు రుణం విడుదల చేసింది. వీటికి తోడు కేంద్రం ఫేజ్-1 అభివృద్ధికి కేటాయించిన రూ.15వేల కోట్లలో ప్రస్తుతం రూ.1,400 కోట్లను సమకూర్చబోతోంది. ప్రపంచ బ్యాంకు మొదటి విడతలో విడుదల చేసిన నిఽధుల్లో దాదాపు 50 శాతం ఖర్చు చేసినట్టు సురే్‌షకుమార్ తెలిపారు. మొదటి విడత రుణంలో 75శాతం ఖర్చుచేసిన తర్వాత మిగతా బిల్లులు సమర్పించటానికి వెసలుబాటు ఉంటుందని, డిసెంబరు కంటే ముందే తదుపరి వాయిదాను క్లెయిమ్ చేసుకోగలమని పేర్కొన్నారు.