ఘనంగా మాతృభాషా పరిరక్షణ సమితి వార్షికోత్సవం
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:37 PM
తెలుగుభాష గొప్పతనాన్ని, సంస్కృతీ పరిమళాన్ని, సాహిత్య సంపదను నేటితరానికి అందించాలన్న సంకల్పంతో ఏర్పాటైన మాతృభాషా పరిరక్షణ సమితి 20వ వార్షికోత్సవాన్ని పట్టణంలోని శ్రీశైల పబ్లిక్‌స్కూల్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
నంద్యాల కల్చరల్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలుగుభాష గొప్పతనాన్ని, సంస్కృతీ పరిమళాన్ని, సాహిత్య సంపదను నేటితరానికి అందించాలన్న సంకల్పంతో ఏర్పాటైన మాతృభాషా పరిరక్షణ సమితి 20వ వార్షికోత్సవాన్ని పట్టణంలోని శ్రీశైల పబ్లిక్‌స్కూల్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సమావేశాన్ని సమితి అధ్యక్షుడు డా.దివి హయగ్రీవాచార్యులు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చంద్రశేఖర కల్కూర, జేఎ్‌సఆర్‌కే శర్మ, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన దేశం సులోచన, విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్, గెలివి సహదేవుడు, కిషోర్‌కుమార్ హాజరయ్యారు. వక్తలు మాట్లాడుతూ తెలుగుభాషా, సంస్కృతి, సాహిత్యవికాసాలకు కృషి చేయాలన్నారు. జేఎ్‌సఆర్‌కే శర్మ రచించిన రాయలసీమ కావ్యసముద్ర మధనం, పింగళిసూరన సాహితీ వైభవం పుస్తకాలను ఆవిష్కరించారు. ‘పింగళిసూరన సాహితీ వైభవం’ పుస్తకాన్ని నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి దండెబోయున పార్వతీ, ‘రాయలసీమ కావ్య సముద్ర మధనం’ను డా. చంద్రమౌళి సమీక్షించారు. సమావేవంలో అన్నెం శ్రీనివాసరెడ్డి, శేషఫణిశర్మ, డా.నీలం వెంకటేశ్వర్లు, కొప్పుల ప్రసాద్, శ్రీనివాసమూర్తి, గోళ్ల సుదర్శనం, వసుంధర, విజయదుర్గ, మురళీనాధరెడ్డి, కన్నయ్య, మురళీకృష్ణారావు, గద్వాల రామక్రిష్ణ, రామసుబ్బారెడ్డి, మోహనరెడ్డి, కృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రఫీ పాల్గొన్నారు.