Share News

Agricultural Celebration: 175 ట్రాక్టర్లతో అన్నదాత విజయోత్సవ ర్యాలీ

ABN , Publish Date - Aug 11 , 2025 | 04:52 AM

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

 Agricultural Celebration: 175 ట్రాక్టర్లతో అన్నదాత విజయోత్సవ ర్యాలీ

  • ప్రత్తిపాడులో ఎమ్మెల్యే సత్యప్రభ ఆధ్వర్యంలో నిర్వహణ

  • పాలకొండలో 100 ట్రాక్టర్లతో ఎమ్మెల్యే నిమ్మక ర్యాలీ

ప్రత్తిపాడు, పాలకొండ, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయం వద్ద వరుపుల రాజా విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ర్యాలీ ప్రారంభించారు. తొలుత ఎడ్ల బండిపై, ఆ తరువాత ట్రాక్టర్‌పై రైతు వేషధారణలో ఆమె యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో 175 ట్రాక్టర్లు పాల్గొన్నాయి. ఒమ్మంగి, చినశంకర్లపూడి గ్రామాల్లో వరినాట్లు వేసిన ఎమ్మెల్యే... రాచపల్లి, ఉత్తరకంచి, లంపకలోవలలో రైతు కూలీలను పలకరించారు. కాగా, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఆదివారం జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ జరిగింది. 100 ట్రాక్టర్లతో రైతులు భారీగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత విత్తనాల పంపిణీ నుంచి ఎరువులు, సాగునీరు తదితర విషయాల్లో రైతులకు మేలు చేసే విధంగా చర్యలు చేపడుతోందని తెలిపారు.

Untitled-3 copy.jpg

Updated Date - Aug 11 , 2025 | 04:53 AM