Agricultural Subsidies: అన్నదాత-సుఖీభవ జాబితాలు సిద్ధం
ABN , Publish Date - Jul 09 , 2025 | 05:45 AM
అన్నదాత-సుఖీభవ పథకానికి అర్హులైన రైతుల జాబితాలు సిద్ధమయ్యాయి. వ్యవసాయ శాఖ అధికారులు వీటిని రైతుసేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు.
రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో...
‘మనమిత్ర’ వాట్సా్‌పలోనూ సమాచారం
అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): అన్నదాత-సుఖీభవ పథకానికి అర్హులైన రైతుల జాబితాలు సిద్ధమయ్యాయి. వ్యవసాయ శాఖ అధికారులు వీటిని రైతుసేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. లబ్ధిదారులు జాబితాలను ప్రింట్ తీసుకునే అవకాశం కల్పించారు. ఆధార్ నంబరు ద్వారా ‘నో యువర్ స్టేట్‌స’లో నకలు తీసుకోవచ్చు. అలాగే ’మన మిత్ర వాట్సాప్’ ద్వారా కూడా లబ్ధిదారులు వివరాలను తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. జాబితాలో పేరు లేని అర్హులైన రైతులు రైతుసేవా కేంద్రంలో ఆధార్, భూమి వివరాలతో తగిన ధ్రువపత్రాలు సమర్పించి, గ్రీవెన్స్ మాడ్యూల్‌లో నమోదు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు మంగళవారం తెలిపారు. ఈ గ్రీవెన్స్‌ను జూలై 13 వరకు పొడిగించామన్నారు. ‘పీఎం కిసాన్’ నిధులను కేంద్రం విడుదల చేసిన రోజే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత- సుఖీభవ నగదు విడుదల చేయనుంది.