Share News

Anil Kumar Singhal: రెండోసారి అవకాశం బాధ్యతను పెంచింది

ABN , Publish Date - Sep 11 , 2025 | 06:58 AM

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా రెండోసారి అవకాశం రావడంతో తన బాధ్యత మరింత పెరిగిందని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అన్నారు.

Anil Kumar Singhal: రెండోసారి అవకాశం బాధ్యతను పెంచింది

  • భక్తుల సూచనలతో సేవల నాణ్యత పెంచుతాం

  • టీటీడీ ఈవోగా ఏకే సింఘాల్‌ బాధ్యతల స్వీకరణ

తిరుమల, సెప్టెంబరు10(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా రెండోసారి అవకాశం రావడంతో తన బాధ్యత మరింత పెరిగిందని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అన్నారు. బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. పూర్వ ఈవో శ్యామలరావు నుంచి బాధ్యతలు తీసుకున్న ఆయనతో టీటీడీ బోర్డు మెంబర్‌ సెక్రటరీ ఎక్స్‌ అఫిషియోగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ సేకరించి సేవల నాణ్యతను పెంచుతామని చెప్పారు. అంతకుముందు సింఘాల్‌ అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుని తలనీలాలు సమర్పించారు.

Updated Date - Sep 11 , 2025 | 07:01 AM