AP Govt: 21 మంది ఐపీఎస్‌ల బదిలీ
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:26 AM
రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పలువురు అధికారులకు తాజాగా పోస్టింగ్‌లు లభించగా, మరికొందరు
విశాఖ డీసీపీగా మణికంఠ
బెజవాడకు కృష్ణకాంత్ పటేల్
ట్రాఫిక్ డీసీపీగా షేక్ షరీన్ బేగమ్
ఎన్టీఆర్ రూరల్ డీసీపీగా లక్ష్మీనారాయణ
వెయిటింగ్‌లో ఉన్న పలువురు అధికారులకు పోస్టింగ్‌లు
అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పలువురు అధికారులకు తాజాగా పోస్టింగ్‌లు లభించగా, మరికొందరు బదిలీ అయ్యారు. ఇటీవల బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు మణికంఠ చందోలు, కృష్ణకాంత్ పటేల్‌కు విశాఖపట్నం, విజయవాడలలో శాంతిభద్రతల డీసీపీలుగా పోస్టింగ్‌లు లభించాయి. మరికొందరికి ఏసీబీ, సీఐడీ, ఏపీఎస్పీ బెటాలియన్లలో పోస్టింగ్‌లు ఇస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.